Breaking News

బుద్దా భవన్‌ వద్ద ఉద్రిక్తత.. హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిరసన

Published on Wed, 09/17/2025 - 11:35

సాక్షి, హైదరాబాద్‌: బుద్ధా భవన్‌ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్‌ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బుద్ధా భవన్‌ వద్ద డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది ఆందోళనలకు దిగారు. రాత్రి, పగలు తమతో పనులు చేయించుకుని.. జీతంలో ఐదు వేలు కట్‌ చేశారని నిరసన చేపట్టారు. అయితే, గతంలో జీహెచ్‌ఎంసీ అండర్‌లోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది.. ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది.

ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. అందరికీ ఒకేలా జీతాలు అందాల్సి ఉన్నప్పటికీ తమకు మాత్రం 5000 కట్‌ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్‌ అయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతం ఇచ్చే వరకు ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొంటామన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)