Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ యువకుడు మృతి

Published on Thu, 01/30/2025 - 07:53

ఖైరతాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన  మహ్మద్‌ వాజిద్‌ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాలో నివసించే మహ్మద్‌ అజీజ్‌ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్‌ వాజిద్‌ (28) 2021లో ఎంఎస్‌ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. 

వాజిద్‌ తమ్ముడు మహ్మద్‌ మాజిద్‌ కూడా అక్కడే ఎంఎస్‌ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్‌ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్‌ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  

పెళ్లి చేసే యోచనలో ఉండగానే..  
మహ్మద్‌ వాజిద్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే..  అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్‌ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం. 

వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్‌ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్‌ వాజిద్‌ గతంలో ఖైరతాబాద్‌ యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్‌ మక్తాలోని వాజిద్‌ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పరామర్శించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)