Breaking News

హైదరాబాద్‌లో లిఫ్ట్ బీభత్సం.. మహిళ విషాదం!

Published on Wed, 08/05/2026 - 05:36

హైదరాబాద్‌, చందానగర్‌: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్‌ ఆపరేటర్‌ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్‌ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్‌ నల్లగండ్లలోని అపర్ణ జినిత్‌లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్‌ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్‌ మాన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్‌ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్‌ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్‌మెంట్‌ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్‌ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్‌కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)