Breaking News

HYD: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క టిక్కెట్‌తో డబుల్‌ జర్నీ!

Published on Fri, 10/02/2026 - 08:24

సాక్షి, హైదరాబాద్‌: ఒకే టికెట్‌పై సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ, మెట్రో రోజువారీ, నెలవారీ ఉమ్మడి పాస్‌లు శుక్రవారం నుంచి  ప్రారంభం కానున్నాయి. ప్రజాభవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్‌ పాస్, ‘మీ టికెట్‌’ మొబైల్‌ యాప్‌లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఉమ్మడి పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్‌లలో లభించనున్నాయి. ఈ పాస్‌లతో పుష్పక్‌ మినహా  ఔటర్‌రింగ్‌ లోపల నడిచే అన్ని ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో, మెట్రోరైళ్లలో వినియోగించుకోవచ్చు. నగర బస్సుల్లో నిత్యం సుమారు 25 లక్షలు, మెట్రో రైళ్లలో 4.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజువారీ ప్రయాణాలకు చాలామంది బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగిస్తున్నారు.  ఈ రెండు సేవల మధ్య సులభంగా మారే సౌకర్యం ఉమ్మడి పాస్‌లతో లభించనుంది.

రెండు రకాలుగా.. కార్డుకు అదనంగా రూ.వంద
రెండు రకాల ఉమ్మడి పాస్‌లు ఉంటాయి. రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8500 చొప్పున ఉంటుంది. ఈ చార్జీల్లో డెయిలీ పాస్‌పై రూ.100, నెలవారీ పాస్‌పై రూ.1500 చొప్పున ఆర్టీసీ ఖాతాలో జమ అవుతాయి. మెట్రోకు  డెయిలీపై రూ.300, మంత్లీ పాస్‌పై రూ.7,000 చొప్పున లభిస్తాయి. మొదటిసారి ఉమ్మడి పాస్‌ను కొనుగోలు చేసినప్పుడు కార్డు ధర రూ.100 అదనంగా చెల్లించాలి.  దీనిని తిరిగి ఇచ్చేటప్పుడు రూ.వంద వాపస్‌ ఇస్తారు.

సిటీ బస్సుల్లో టికెట్‌ లెస్‌ జర్నీ..
మరోవైపు  సిటీ బస్సుల్లోలో టికెట్‌లెస్‌ జర్నీ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. కాగితపు టికెట్లకు బదులు మీ టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రదేశం, గమ్యస్థానాలను ఎంపిక చేసుకొని డిజిటల్‌ విధానంలో సులభంగా చార్జీలను చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టికెట్‌ వస్తుంది. ప్రయాణ సమయంలో దీనిని కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది.  

డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ రూ.600
మీ టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రయాణికులు రూ.600 చెల్లించి డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ కూడా తీసుకోవచ్చు. బస్‌పాస్‌ కౌంటర్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే వీక్లీ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌తో వారం పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన వెంటనే మొబైల్‌ యాప్‌లోనే అప్పటికప్పుడు రెన్యూవల్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: చదువు.. ఉపాధి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)