Breaking News

అమెరికాలో ప్ర‌మాదం.. హైద‌రాబాద్ విద్యార్థికి గాయాలు

Published on Sat, 11/22/2025 - 21:13

హైద‌రాబాద్‌ : అమెరికా ఫ్లొరిడాలోని అపార్ట్‌మెంటులో జరిగిన అగ్ని ప్రమాదంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబర్‌పేటకు చెందిన విద్యార్థి గాయపడ్డాడు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌(23) ఎంఎస్‌ చదువుకోవడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా ఫ్లొరిడా (Florida) వెళ్లాడు.

ఈ నెల 19 అతను నివసిస్తున్న అపార్ట్‌మెంటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమీర్‌ హుస్సేన్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడుతుండ‌గా.. తన భవనం మంటల్లో చిక్కుకుందని అరవడం ప్రారంభించాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత అత‌డి ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది. త‌మ కుమారుడికి ఏమైందో తెలియ‌క త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందారు. వారికి కొంత స‌మ‌యం త‌ర్వాత అమీర్‌ హుస్సేన్ స్నేహితుడు క‌ళ్యాణ్ ఫోన్ చేశాడు. హుస్సేన్‌ను మొద‌ట‌ తల్లాహస్సీ మెమోరియల్ హెల్త్ కేర్‌కు త‌ర‌లించార‌ని, త‌ర్వాత గైనెస్‌విల్లేలోని యుఎఫ్ హెల్త్ షాండ్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలియజేశాడు.

చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూమరుని కోసం అమెరికా (America) వెళ్లేందుకు సిద్దపడ్డారు. దీంతో స్థానిక కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డిని సంప్రదించడంతో వెంటనే స్పందించి వీదేశి వ్యవహారాల మంత్రికి లేఖ రాసి సహాయం అందించి తాత్కలిక వీసా ఇవ్వాలని కోరారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

చ‌ద‌వండి: వడివడిగా మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)