Breaking News

Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..

Published on Tue, 11/05/2024 - 13:39

బంజారాహిల్స్‌: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్‌ కమేడీయన్‌ ఉత్సవ్‌ దీక్షిత్‌ను ఇప్పటికే బంజారాహిల్స్‌  పోలీసులు అరెస్ట్‌ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్‌ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్‌ పోలీసులు లేఖ రాయనున్నారు. 

ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్‌ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్‌ దీక్షిత్‌ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్‌కు లాక్‌ పడటంతో ఈ  ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్‌లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.  

ఉత్సవ్‌ దీక్షిత్‌ అరెస్టు 


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)