Breaking News

హైద‌రాబాదీల‌కు అందుబాటులో మ‌రో ఫ్లైఓవర్‌

Published on Wed, 05/28/2025 - 18:23

సాక్షి,హైద‌రాబాద్‌:  ఔటర్‌ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) నుంచి కొండాపూర్‌ వరకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ప్రయాణించే వారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. శిల్పా లేఔట్‌ రెండో ఫేజ్‌ ఫ్లైఓవర్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. దీంతో నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యం కలగనుంది. గ‌చ్చిబౌలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.  

ఇదీ ప్రాజెక్ట్‌ 
ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద రూ.178 కోట్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఆరు లేన్లతో ఉన్న దీని పొడవు 1.2 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. ఇప్పటికే గ‌చ్చిబౌలి జంక్షన్‌ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ 1 ఫ్లైఓవర్‌ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్‌ 2గా ఈ ఫ్లైఓవర్‌ నిర్మించారు. కొండాపూర్, హఫీజ్‌పేట్‌ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. 

ఎస్సార్‌డీపీ (SRDP) కింద నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇది 23వది. ఈ ఫ్లై ఓవర్‌ను త్వరితగతిన పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతున్న కమిషనర్‌ కర్ణన్‌ దీంతోపాటు ఫలక్‌నుమా, శాస్త్రిపురంల ఆర్‌ఓబీలు సైతం త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను  కోరారు. ఈ రెండు ఆర్‌ఓబీలతో ఎస్సార్‌డీపీ కింద చేపట్టిన పనులు 39 పూర్తవుతాయి.  

హై సిటీగా.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాజెక్టుల పనులను హై సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కింద చేస్తున్నారు. దీని ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో కొత్తగా 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు,  4 ఆర్‌ఓబీలు, 3 ఆర్‌యూబీలతోపాటు పది మార్గాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులున్నాయి. వీటిల్లో కొన్ని పనుల్ని వచ్చే నెలలో చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ (GHMC) పేర్కొంది.

చ‌ద‌వండి: ఫ‌తేన‌గర్ వంతెన మెట్ల కూల్చివేత‌   

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)