Breaking News

షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!

Published on Fri, 07/14/2023 - 10:52

సాక్షి,ఖలీల్‌వాడి(హైదరాబాద్‌): నవీపేట్‌ శివారులో సాయినగర్‌ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్‌ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్‌లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్‌ లాగి ఆపిన విషయం తెలిసిందే.

అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్‌టాప్‌తో డబ్బులు, ల్యాప్‌టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్‌ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. 

మర్మమేమిటో..! 
బాసర రైల్వే పోలీసులు, ఆర్‌ఫీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్‌ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్‌ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు.

బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్‌ కోచ్‌ నుంచి జనరల్‌ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్‌ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్‌ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..! 
సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్‌పీఎఫ్‌ పోలీసులు రైలు లో నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం.

చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)