Breaking News

మహిళా నిరసనకారుల కోసం మహిళా పోలీసులతో స్వాట్

Published on Wed, 06/04/2025 - 05:58

సాక్షి, హైదరాబాద్‌: నిరసనలు..ధర్నాలు..ఆందోళనల్లో పాల్గొనే మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో వారి ఆత్మగౌర వానికి భంగం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పోలీ సులు స్వాట్‌ (స్విఫ్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకొని, పోలీస్‌స్టేషన్లకు తరలించే సందర్భాల్లో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో ప్రారంభించారు.

ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన...
హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు గత ఏడాది డిసెంబర్‌లో నిరసన తెలిపారు. వీరిని ముందస్తు అరెస్టు చేయడానికి అవసరమైన స్థాయిలో మహిళాపోలీసులు లేకపోవడం, ఉన్న వారికీ నైపుణ్యం లేకపోవడంతో ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పోలీసులు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం మహిళా నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులతో కూడిన వింగ్‌ ఉండాలని నిర్ణయించింది. దీంతో నగర సాయుధ విభాగం (సీఏఆర్‌) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన 2024 బ్యాచ్‌ కానిస్టేబుళ్లతో స్వాట్‌ టీమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఒక్కో ప్లటూన్‌లో 21 మంది చొప్పున రెండింటికి రూపం ఇవ్వడానికి సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

బైక్‌ స్టంట్‌తో అబ్బురపరిచిన పూజ...
ప్రదర్శన సందర్భంగా స్వాట్‌ సభ్యురాలు పి.పూజ బైక్‌ స్టంట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమె కడుపుపై ఓ చెక్క పెట్టిన శిక్షకులు దాని మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. దీనికోసం తాను ఎలాంటి ప్రాక్టీసు చేయలేదని, కేవలం డెమో నిర్వహించి నేరుగా వచ్చానని వివరించారు. జాతీయస్థాయిలో వాలీబాల్‌ ప్లేయర్‌ అయిన పూజ.. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లోనూ పాల్గొన్నారు. వాలీబాల్‌లో గోల్డ్, ఆర్మ్‌ రెజ్లింగ్‌లో బ్రాంజ్‌ మెడల్స్‌ గెల్చుకున్నారు.

ఎలాంటి దుస్తులు ధరించినా నేర్పుగా 
నిరసన తెలుపుతున్న మహిళలందరూ ఒకే విధమైన దుస్తులు ధరించరు. చీర, చుడీదార్, జీన్స్‌ ఇలా ఏ రకమైన వస్త్రాలు ధరించిన వారిని ఎలా అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. ఒకే చోట గుంపుగా ఉన్న ఆందోళనకారుల్నీ సోలార్‌ లాక్, ప్రామిస్‌ లాక్‌ అనే టెక్నిక్స్‌ వాడుతూ ఎలా లిఫ్ట్‌ చేయాలన్నది నేర్చుకున్నాం. – జె.ఉమ

రెండు రకాల మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ
స్వాట్‌ ట్రైనింగ్‌లో భాగంగా జిమ్‌ వ్యాయామంతోపాటు రెండు రకాలైన మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించారు. కరాటేలో కట్టాస్, పంచెస్, సెల్ఫ్‌ డిఫెన్స్, కిక్స్‌... క్రావ్‌మగాలో రియల్‌ ఫైట్, ఏడు మూవ్‌మెంట్స్‌లో ఎదుటి వ్యక్తిని నేలకూల్చడం తదితర అంశాల్లో అవగాహన కల్పించారు. – టి.శిల్పవర్ధన్‌

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో స్వాట్‌ బృందాల ప్రదర్శన 
తొలి దశలో 35 మందిని స్వాట్‌ కోసం ఎంపిక చేశారు. వీరికి పోలీసులతోపాటు మార్షల్‌ ఆర్ట్స్, మాబ్‌ కంట్రోల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో 45 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. మహిళలతోపాటు పురుష నిరసనకారుల్ని అదుపు చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, ఎలాంటి ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో స్వాట్‌ బృందాలు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించాయి. సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో పని చేయనున్న ఈ బృందాలకు ఆర్‌ఎస్సై మౌనిక పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. త్వరలోనే మరో ఏడుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)