Breaking News

MLC Elections: బలం మజ్లిస్‌దే!

Published on Sat, 04/05/2025 - 07:30

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా  మారింది. ఎన్నికల్లో ఓటర్ల (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) బలం ఎంఐఎం (మజ్లిస్‌)కే ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి గెలవడం నల్లేరు మీద నడకేనని, ఆ లెక్కన మిగతా పార్టీలేవీ కూడా తమ అభ్యర్థిని కూడా బరిలో దింపకుండా ఎన్నిక ఏకగ్రీవమే కాగలదని ఇప్పటిదాకా అందరూ భావించారు. నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో పోలింగ్‌ నాటికి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. 

ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేదన్నది బీజేపీకి తెలియనిది కాదు.. అయినా రంగంలోకి  దిగిందంటే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న ప్రచారానికి తావిచి్చంది. జీహెచ్‌ఎంసీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 వార్డులున్నప్పటికీ, ఈ ‘స్థానిక’ ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు ఈ స్థానిక సంస్థలో ఓటేసేందుకు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ఇద్దరు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు చేరారు. ఓటర్లుగా చేరేందుకు ఇక ఎవరికీ అవకాశం లేదు. గడువు ముగిసిపోయింది.  

రాబోయే మేయర్‌ స్థానంపై అవగాహనతో..? 
ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్‌ ఇంకా ప్రమాణం చేయనందున వారు ఓటర్లు కాలేదని సమాచారం. తాజా సమాచారం మేరకు సైతం అన్ని పార్టీల కంటే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఆ పార్టీకి చెందిన ఓటర్లు 49 మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఎలాగూ తమ అభ్యర్థిని బరిలోకి దింపదని, ఎంఐఎంకు మద్దతునిస్తుందని, రాబోయే జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహనకు వచి్చనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించకుండా కాంగ్రెస్‌కు మద్దతునట్లుగానే అందరూ భావిస్తున్నారు.  

మద్దతు కూడగట్టే ధీమాలో బీజేపీ.. 
మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఎంఐఎంతో పోరాడి గెలిచేందుకు తాము ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలమనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారిలో ఎందరు ఇప్పుడు తాముంటున్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్‌ మద్దతిచ్చే ఎంఐఎంకు ఎందరు ఓటు వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్‌ కార్పొరేటర్లలో ఉంది. 

వాస్తవానికి కార్పొరేటర్‌ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినప్పటికీ, వారీ ఎన్నికలో ఓటర్లు కారు. ఇక కార్పొరేటర్లలో.. బీఆర్‌ఎస్‌ నుంచి వచి్చన కార్పొరేటర్లే కాంగ్రెస్‌ ఓటర్లుగా ఉన్నారు. ఇలా వివిధ అంశాలు, వ్యక్తిగత పరిచయాలు, అభిమానాలు, తదితరమైన వాటితో తాము బలంగా పోటీనివ్వగలమన్న ధీమాతోనే బీజేపీ బరిలో దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వేటికవిగా మిగతా రెండూ ఒకటేనని ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? బీఆర్‌ఎస్‌ ఎటు మొగ్గుచూపనుంది? కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయనున్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)