Breaking News

ఐబొమ్మ ర‌వి కేసులో కొత్త‌ మ‌లుపులు

Published on Tue, 12/30/2025 - 11:54

సాక్షి, హైదరాబాద్‌: ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి విచారణలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక విషయాలు గుర్తిస్తున్నారు. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురూ గతంలో ఇతడికి స్నేహితులే కావడం గమనార్హం. వెల్లెల ప్రహ్లాద్‌ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్‌ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.

గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్‌ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్‌ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్‌ పేరుతోనే డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.

ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్‌ అయిన కాళీప్రసాద్‌ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్‌.ఇన్, సప్లయర్స్‌.ఇన్‌ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్‌ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. పోలీసు కస్టడీ ముగియడంతో రవిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. 

చ‌ద‌వండి: ఐబొమ్మ నాదే అన‌డానికి ఆధారాలు ఉన్నాయా?

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)