Breaking News

HYD: ఉధృతంగా మూసీ.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published on Tue, 09/05/2023 - 10:26

సాక్షి, హైదరాబాద్‌:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్‌ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 
 

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు.
 

ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. బేగంపేట ప్రకాశ్‌ నగర్‌ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్‌ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 

పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్‌ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.  మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్‌లోనూ భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్‌ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్‌పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్‌పల్లి దీన్‌దయాల్‌ నగర్‌లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్‌ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్‌ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్‌ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)