హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం!

Published on Sun, 07/12/2026 - 09:06

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఫిలింనగర్ సైట్ 2 రోడ్ నంబర్ 5 లో ఉదయం 4 గంటల సమయంలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటు బద్దలు కొట్టి లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్‌ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న యువకులు ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫెరారీ స్పోర్ట్స్ కారును క్రేన్  సహాయంతో టోయింగ్ వెహికల్ లో ఫిలింనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ ప్రమాదం మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? లేదంటే నెగ్లిజెన్సీ రాష్ డ్రైవింగ్ కారణమా? ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)