వాట్సాప్‌ ఛానల్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

Published on Wed, 10/29/2025 - 14:40

సాక్షి, హైదరాబాద్‌: నగర పౌరులకు అప్‌డేట్లు అందించేందుకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను బుధవారం ప్రారంభించారు. భారత్‌లో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్ డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను వెంటనే ఫాలో కావాలంటూ సీపీ కోరారు.

కాగా, ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ మోసాలు అధిక అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్‌ ఫేక్‌ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్‌ వర్డ్‌’తో రక్షణ పొందాలని హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్‌ వర్డ్‌’ ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్‌ ఫేక్‌, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ ‘సురక్షిత పదం’ (సేఫ్‌ వర్డ్‌)ను ఉపయోగించాలన్నారు.

మంగళవారం(అ​​​క్టోబర్‌ 28) తన ‘ఎక్స్‌’ ఖాతాలో నగర సీపీ సజ్జనార్.. ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను  క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డీప్‌ ఫేక్‌కు కోడ్‌ వర్డ్‌తో చెక్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)