Breaking News

Video: చెక్‌పోస్టు వద్ద ఆగకుండా.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు

Published on Fri, 10/20/2023 - 16:15

రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతి వేగం, అజాగ్రత్త, రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం నేరం. దీని వల్ల  మనతోపాటు ఎదుటివాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రోడ్డు భద్రతా చర్యలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ప్రయాణించి అనేక అనర్థాలకు కారణకులుగా మారుతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వెళ్లడమే కాకుండా.. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై ఓ కారు దూసుకెళ్లింది. వివరాలు.. బుధవారం తెల్లవారు జామున ట్రాఫిక్‌ పోలీసులు చిలకలగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంతో వెళ్తున్న ఓకారు చెక్‌పోస్టు వద్ద హైస్పీడ్‌తో దూసుకొచ్చింది.

కారును గమనించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దానని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ మహేష్‌కు తీవ్ర గాయాలవ్వగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓవర్‌ స్పీడ్‌తో నడిపిన కారు డ్రైవర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు అతడిపై కఠిన చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)