Breaking News

కన్నతల్లి కన్నీటి వ్యథ

Published on Wed, 01/29/2025 - 08:11

హైద‌రాబాద్‌: పీపుల్స్‌ ప్లాజా వేదికగా గత ఆదివారం భారతమాత ఫౌండేషన్‌ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident) ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్‌ మృతదేహం మంగళవారం లభించగా.. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న గణపతి అనే యువకుడు కూడా మంగళవారం మృతిచెందాడు.  

రెండు రోజులుగా గాలింపు..
నాగారంకు చెందిన అజయ్‌ మిస్సింగ్‌ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం (Monday) తెల్లవారుజామున లేక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు, లేక్‌ పోలీసులు, లుంబీపార్క్‌ బోటింగ్‌ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్కు వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది.  

అజయ్‌ కుటుంబంలో విషాదం
కన్నబిడ్డ క్షేమంగా ఉంటాడని గంపెడాశతో ఎదురు చూసిన అజయ్‌ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెండు రోజులుగా హుస్సేన్‌ సాగర్‌ వద్దే పడిగాపులు కాస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికిందని తెలియగానే.. తల్లిదండ్రులు జానకిరాం, నాగలక్ష్మి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

తూ.గో జిల్లా నుంచి వచ్చిన..
టాటా ఏస్‌ డ్రైవర్‌ గణపతి (22) తూర్పు గోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు.
  
అనుమతి తీసుకున్నారా?
కాగా సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్‌ ఇన్‌చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు తెలిసింది.

బాణసంచా కాలుస్తుండగా..
మహా హారతి ఇచ్చే క్రమంలో హుస్సేన్‌ సాగర్‌లో బోటులోంచి బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోట్‌లో ఉన్న వారంతా నీటిలోకి దూకేశారు. ఈ క్రమంలో నీటిలోకి దూకిన వారిలో నాగారంకు చెందిన సిల్వేరు అజయ్‌(21) గల్లంతయ్యాడు. అదే బోటులో మంటల తాకిడికి తీవ్ర గాయాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గణపతి (22) మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడటం విషాదాంతంగా మారింది.  

చ‌ద‌వండి: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

రెండు రోజులుగా బోటింగ్‌ నిలిపివేత
సాగర్‌లో బోటింగ్‌లో మంటలు చెలరేగి యువకుడు గల్లంతైన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో సాగర్‌లో బోటింగ్‌ నిలిపివేశారు. బోటింగ్‌ సిబ్బంది మొత్తం అజయ్‌ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)