Breaking News

సారూ.. ఉద్యోగం ఇప్పించండి

Published on Sun, 12/17/2023 - 10:24

గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తినందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను విధుల నుంచి తొలగించిందని, జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేసినా, నాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం సీఎం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లారు. అక్కడ తన గోడు వెళ్లబోసుకున్నారు.

ఉద్యోగ భధ్రత కోసం ఆందోళన..
సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో 2016లో హోంగార్డులు ధర్నా చేశారు. గోదావరిఖనికి చెందిన హోంగార్డు మామిడి పద్మ ఆందోళనల్లో పాల్గొని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును విమర్శించారు. పర్యవసనంగా ఆమె తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. భర్త వదిలేయడంతో ఏ పనిచేసుకోవాలో తెలియక, తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని సీపీ, డీజీపీ, హోంమంత్రిని వేడుకున్నారు. 

హోంగార్డు పద్మ 2009లో వేములవాడలో తొలిపోస్టింగ్, రెండేళ్లు పనిచేసిన తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. జీతాలు పెంచి ప్రతినెలా చెల్లించాలనే డిమాండ్‌తో ఏడేళ్ల క్రితం వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రి వద్ద హోంగార్డులు ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్నందుకు పద్మ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈమెపై అనేక కేసులు బనాయించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు తన గోడును కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సమస్య పరిష్కరించి ఉద్యోగం ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)