Breaking News

HMDA: బిల్డ్‌ నౌతో వేగం పెరిగినా..

Published on Fri, 06/27/2025 - 18:06

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికా విభాగంలో పారదర్శకత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సకాలంలో అనుమతులు లభించకపోవడం వల్ల దరఖాస్తుదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొని ఉండగా, మరోవైపు కన్సల్టెంట్‌లు, లైజనింగ్‌ సిబ్బంది ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రమే త్వరితగతిన మోక్షం లభిస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భవన నిర్మాణాలు, లే అవుట్‌ అనుమతులను మరింత వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా ఇచ్చేందుకు కొత్తగా బిల్డ్‌నౌ సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ జాప్యాన్ని నివారించ లేకపోవడం గమనార్హం.

బిల్డ్‌నౌ (BuildNow) వెబ్‌సైట్‌ ద్వారా క్షణాల్లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం లభించింది. కానీ, ఫైళ్లను పరిష్కరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు అందజేయడంలో మాత్రం జాప్యం కొనసాగుతోందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అనుమతుల్లో ఉద్దేశపూర్వకమైన జాప్యాన్ని అరికట్టేందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకొనేవారు. జరిమానాలు విధించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడం వల్ల కూడా పారదర్శత కనిపించడం లేదు. మరోవైపు ఈ పరిణామం వల్ల నిజాయతీగా పని చేసే అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సైతం అప్రతిష్టను మూట గట్టుకోవలసి వస్తోందని ప్రణాళికా విభాగానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు.

రియల్‌ పరుగులు... 
కొంతకాలంగా నగరంలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు పెరిగాయి. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్‌ వెలుపల బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. అదే సమయంలో భారీ లే అవుట్‌లు సైతం వెలుస్తున్నాయి. దీంతో అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తులు కుప్పలుగా వస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది నిర్మాణ రంగంలో అనుమతులు రెట్టింపు అయినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. 

శంషాబాద్, అమీన్‌పూర్, కొల్లూరు, పటాన్‌చెరు, మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి (Bachupally) తదితర ప్రాంతాల్లో హైరైజ్డ్‌ టవర్లు, బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం పెరిగినట్లు అంచనా. మరోవైపు టీజీ బీపాస్‌ కంటే బిల్డ్‌నౌ వెబ్‌సైట్‌లో వెంటనే ‘కీ’లు లభించడం వల్ల కూడా దరఖాస్తు ప్రక్రియ సులభతరమైంది. వివిధ రకాలుగా వచ్చిన మార్పులు ఇటు కన్సల్టెంట్‌ల రూపంలో ఉండే మధ్యవర్తులకు, లైజనింగ్‌ సిబ్బంది పేరిట పైరవీలు చేసేవారికి చక్కటి అవకాశంగా మారింది.

ట్రిపుల్‌ ఆర్‌ వరకు అనుమతులు  
హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిని ట్రిపుల్‌ ఆర్‌ వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. గతంలో డీటీసీపీ నుంచి అనుమతులు పొందిన ప్రాంతాలన్నీ ఇప్పుడు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్తగా విలీనమైన 11 జిల్లాల పరిధిలోని 3,550 గ్రామాల్లో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి నిర్మాణ సంస్థలకు ఊరట లభించింది. 

చ‌ద‌వండి: సిటీ ఆఫ్ టెర్ర‌స్‌ గార్డెన్స్.. కొత్త పుంత‌లు

ఇదివరకు డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న అపరిష్కృత ఫైళ్లు సైతం హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. అన్ని విధాలుగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు, నిర్మాణరంగంలో మార్పులు చోటుచేసుకొని వేగం పెరిగింది. అదేస్థాయిలో హెచ్‌ఎండీఏకు వచ్చే ఫైళ్లు సైతం గణనీయంగా నమోదవుతున్నాయి. అందుకనుగుణంగానే హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ప్రణాళికా విభాగం కొలువుదీరిన నాలుగు, ఐదు, ఏడో అంతస్థులు పైరవీకారులతో సందడిగా మారడం గమనార్హం. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)