Breaking News

భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య

Published on Tue, 07/15/2025 - 14:56

సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.   

పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్‌ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.

అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్‌,ఓదెలకు చెందిన మోటం మల్లేష్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.    

భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)