Breaking News

భార్యకు వంటరాదని విడాకులా?

Published on Wed, 01/07/2026 - 08:49

సాక్షి, హైదరాబాద్‌: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్పు డు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్‌..సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని 2015, మేలో వివా హం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్‌ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. 

ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ   భర్త హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది.

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)