Breaking News

హైడ్రా రద్దు పిటిషన్‌.. తెలంగాణ సర్కార్‌కు కౌంటర్‌ ఆదేశాలు

Published on Fri, 09/13/2024 - 21:33

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ‘హైడ్రా’ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి కౌంటర్‌ ఆదేశాలు జారీ చేసింది.

హైడ్రా ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చి జీవో 99ను ఛాలెంజ్‌ చేస్తూ లక్ష్మీ అనే మహిళ పిటిషన్‌ ఫైల్‌ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్దంగా జరిగిందని పిటిషనర్‌ వాదించారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని తెలిపారు. జీహెచ్‌ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  

జీవో 99 ప్రకారం హైడ్రాకు  ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)