Breaking News

ఆస్పత్రులకు ఇస్తున్న బడ్జెట్‌ ఎంత?

Published on Thu, 08/17/2023 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఎంత బడ్జెట్‌ ఇస్తున్నారు..? గ్రామీణ, తాలూకా, జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఎంతమంది వైద్యులు అవసరం.. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు..? ఇతర సిబ్బంది పరిస్థితి ఏంటి..? తదితర అంశాలపై పూర్తినివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ డైరెక్టర్‌తో పాటు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు గత డిసెంబర్‌ 26వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి, అక్కడి నుంచి అమ్రాబాద్‌ పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఆస్పత్రికి.. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి రాత్రి 2:30 గంటలైంది. వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు,  అరగంట తర్వాత ఆ బాలింత మరణించా రు.

ఈ ఘటన వివరాలు పత్రికల్లో చూసిన హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి మహిళను తీసుకొచ్చిన సమయంలో వెంటిలేటర్‌ అవసరమైందని, అక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో మరో చోటకు తరలించాల్సి వచ్చిందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు  నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)