Breaking News

వివాహమైనా కుమార్తె అర్హురాలే..

Published on Fri, 04/11/2025 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: కుమార్తె వైవాహిక స్థితిని పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహమైనా ఆమె అర్హురాలేనని, అయితే దీనికి వారి ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలను పరిశీంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు పిటిషనర్‌ దరఖాస్తును పునఃపరిశీలించాలని ఆదేశించింది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. 

కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ యూసఫ్‌ మృతిచెందారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని సీపీ నిరాకరించారంటూ యూసఫ్‌ భార్య షాహీన్‌ సుల్తానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. ‘షాహీన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కుమారుడు కెనడా వెళ్లి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటోంది. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేకపోతోంది’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ‘పిటిషనర్‌కు కుమారుడు ఉన్నారు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే కారుణ్య నియామక విజ్ఞప్తిని సీపీ తిరస్కరించారు. ఫాతిమా, ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్‌ వెల్లడించలేదు’ అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆమె డాక్యుమెంట్లను పునఃపరిశీలన చేసి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు