Breaking News

హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా 

Published on Sat, 07/22/2023 - 16:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీరామ్‌సాగర్‌, నిజాం సాగర్‌, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. హైదరాబాద్‌ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుంది. హిమాయత్‌సాగర్‌ జలాశయం పూర్తిగా నిండిపోయింది. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఏ క్షణమైనా గండిపేట జలాశయం గేట్లు తెరిచే అవకాశం ఉంది.


హుస్సేన్‌ సాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్‌ సాగర్‌ నీటిమట్టాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. హుస్సేన్‌ సాగర్‌ ప్రస్తుత నీటి మట్టం 513.45 మీటర్లు కాగా, పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. లోతట్టు ప్రాంతాల ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
చదవండి: హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఇదంతా అందుకేనా? 

జంట జలాశయాల నిండు కుండలా మారాయి. గండిపేట, హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం భారీగా చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్‌పల్లి, షాద్‌నగర్, షాబాద్‌ నుంచి వరద భారీగా చేరుతుంది.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)