Breaking News

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..

Published on Sun, 05/28/2023 - 15:08

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా  భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది.

విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతా­యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్‌ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 
చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)