Breaking News

హెచ్‌సీయూ రణరంగం

Published on Mon, 03/31/2025 - 06:27

సాక్షి, హైదరాబాద్‌/ రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో  పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.  

అరుపులు.. కేకలు.. అరెస్టులు 
ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్‌ క్యాంపస్‌ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.

దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్‌ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్‌ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పక్కా ప్రణాళికతో  
హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్‌లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

క్యాంపస్‌లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్‌ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)