Breaking News

చేతగానితనం వల్లే వరుస ఘటనలు

Published on Mon, 07/28/2025 - 04:47

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే పాఠశాలల్లో వరుస గా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు జరుగుతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 80 మంది వరకు విద్యార్థులు ఆస్ప త్రిలో చేరారని చెప్పారు. 

ఇటీవల కాలంలోనే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి బీసీ గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్, హుజూరాబాద్‌ బీసీ గురుకులంలో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ 20 నెలల సమయంలో రాష్ట్రంలోని గురుకు లాల్లో 100 మంది విద్యార్థులు చనిపోయారని, అయినా సీఎం రేవంత్‌ రాతి గుండె కరగడం లేదన్నా రు. విద్యాశాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయన సొంత జిల్లాలోనే రోజుకో సంఘటన జరుగుతుంటే ఏమనాలని ప్రశ్నించారు.

తాము పాఠశాలను సందర్శించేందుకు వస్తున్నామని తెలిసి, విద్యార్థుల ను చికిత్స మధ్యలోనే హడావుడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారన్నారు.గురుకులాల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని రెండు చేతులు జోడించి హరీశ్‌రావు అభ్యర్థించారు. పాఠశాలను సందర్శించిన వారిలో మాజీమంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)