Breaking News

నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం

Published on Wed, 03/26/2025 - 05:09

సాక్షి, హైదరాబాద్‌: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. 

గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్‌ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్‌శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క టీచర్‌ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించడంతో బీఆర్‌ఎస్‌ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. 

కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం 
బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్‌ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్‌ఎస్‌ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు.  ­

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)