Breaking News

కాంగ్రెస్‌ అంటేనే కుట్రలు, కూల్చివేతలు

Published on Wed, 11/26/2025 - 03:24

సాక్షి పెద్దపల్లి/ఓదెల/జమ్మికుంట: కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతోందని.. టెర్రరిస్టులకన్నా కాంగ్రెసోళ్లు దుర్మార్గులని దుయ్యబట్టారు. రైతులకు అవసరమైన చెక్‌డ్యాంలు, హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం తప్ప కాంగ్రెస్‌కు కట్టడం తెలియదని ఎద్దేవా చేశారు. 

పెద్దపల్లి జిల్లా గుంపుల–కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల మధ్య మానేరుపై గత శుక్రవారం రాత్రి దుండగులు పేల్చేసిన చెక్‌డ్యామ్‌ను హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ మానేరుపై రూ. 24 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఇసుక మాఫియా వెనుక కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. 

గతంలో పెద్దపల్లి మండలం భోజన్నపేట శివారులోని హుస్సేనిమియావాగు చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్‌ నేతలు జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చేసేందుకు యత్నించగా రైతులు పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినా ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పుడే దోషులను శిక్షించి ఉంటే గుంపుల చెక్‌డ్యామ్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. 

కరీంనగర్‌ ఎల్‌ఎండీ గేట్లు ఎత్తినప్పుడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూలిపోని చెక్‌డ్యామ్‌.. నాణ్యత లోపంతో కూలిపోయిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, ఒకవేళ నాణ్యత లోపంతో కూలిపోతే చెక్‌డ్యామ్‌ నిర్మించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని, దోషులను పట్టుకొని రూ. 24 కోట్లు రికవరీ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

మహిళలకు చీరలు ఇచ్చిసీఎం ఓట్లడుగుతున్నారు 
సిద్దిపేట రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మహిళలకు చీరలు ఇచ్చి ఓట్లడుగుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో నియోజకవర్గంలోని 3,129 మహిళా సంఘాలకు రూ. 3.61 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. 

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాల్లోని 46 లక్షల మందికే చీరలు ఇవ్వడం విడ్డూరమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలూ ఇవ్వలేదని విమర్శించారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)