Breaking News

లోటు.. లక్ష కోట్లు

Published on Mon, 10/13/2025 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం. 

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే. 

అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్‌లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే.  

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంటే...
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్‌ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.  


రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య 
కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. 

సెస్‌ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. 
– ప్రొఫెసర్‌ అందె సత్యం, ఆర్థిక నిపుణులు   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)