Breaking News

గోదావరి ఉగ్రరూపం

Published on Thu, 07/27/2023 - 02:20

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి ఉప నదులతోపాటు తాలి పేరు, కిన్నెరసాని, కడెం, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గోదావరిలోకి భారీగా వరద వస్తోంది.

మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5,11,080, సమ్మక్క బ్యారేజీ నుంచి 7,54,470, సీతమ్మసాగర్‌ నుంచి 10,49,351 క్యూసెక్కులను వదులుతు న్నారు. దీనికి స్థానిక వాగుల ప్రవాహం తోడై.. భద్రాచలం వద్ద ప్రవాహం బుధవారం రాత్రి 9.30 గంటలకు పదకొండున్నర లక్షల క్యూసెక్కులు దాటింది.

నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వరద 48.4 అడుగులు దాటింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 

పోలవరం వద్ద అలర్ట్‌: భద్రాచలం నుంచి వస్తున్న నీళ్లు, స్థానిక ప్రవా హాలు కలసి పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న అధికారులు.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగు వకు వదిలేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 8,37,850 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇది గురువారం ఉదయం 10 గంటలకల్లా 12 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో: కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణలో ఉన్న తొలి జలాశయం జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రాజె క్టుకు 30వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యు దుత్పత్తితో 29,641 క్యూసెక్కులు వదులుతు న్నారు. ఈ నీరంతా శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)