Breaking News

మేం జీహెచ్‌ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?

Published on Sat, 06/13/2026 - 07:45

బంజారాహిల్స్‌: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–14లోని లూసిడ్‌ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–36 శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అమిత్‌కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్‌ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రీశైలం ఇలా వెళ్లడానికి  వీల్లేదని మర్యాదగా చెప్పాడు. 

జీహెచ్‌ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్‌ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్‌ శ్రీశైలంపై దాడికి దిగాడు.  మేం జీహెచ్‌ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్‌కుమార్‌ సదరు కానిస్టేబుల్‌ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం  ఫిర్యాదు మేరకు అమిత్‌కుమార్, ఆనంద్‌లపై బంజారాహిల్స్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)