Breaking News

ప్రాణాలకు తెగించి పనిచేశాం.. అయినా రోడ్డున పడేశారు.. 

Published on Fri, 04/21/2023 - 08:45

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రిలోని నాలుగో తరగతి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వాపోయారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి తమ మొర వినిపించారు. గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని, తాము ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు.

కష్టకాలంలో అందించిన సేవలను మరిచి ఇప్పుడు తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరున ఉద్యోగాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంజయ్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు.   
చదవండి: వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)