Breaking News

గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అరెస్ట్‌

Published on Fri, 10/18/2024 - 10:58

సాక్షి, కూకట్‌పల్లి: ఏపీ నుంచి  సిటీకి  గంజాయి తెచ్చి అమ్ముతున్న  నలుగురు సాఫ్ట్​వేర్ ​ఉద్యోగులను బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ డీమార్ట్‌ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.

పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్‌ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్‌ (24), రమేశ్‌ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు.

 ఈ నలుగురు యువకులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులని,  కేపీహెచ్‌బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)