Breaking News

కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ

Published on Mon, 01/06/2025 - 11:58

హైదరాబాద్‌, సాక్షి: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్‌ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..

ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు.

.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్‌(KTR) ఆ స్టేట్‌మెంట్‌ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్‌ పిటిషన్‌ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్‌ కోరారు.  

ఏసీబీ.. నెక్ట్స్‌ ఏంటి?
విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్‌ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్‌ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)