హైకోర్టు ఆదేశాలు.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్

Published on Mon, 12/16/2024 - 09:36

సాక్షి,హైదరాబాద్‌: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఇవాళ (సోమవారం) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.    

2023 డిసెబర్‌ 23న (శనివారం) హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు సాహిల్‌. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్‌ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టారు.

కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రజాభవన్‌ ఘటన అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్‌ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు గుర్తించారు.దీంతో అతడిపై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ తరుణంలో ఈ ఏడాది డిసెంబర్‌ 4న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. దుబాయ్‌లో ఉన్న విచారణలో భాగంగా సాహిల్‌ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సాహిల్‌ ఇవాళ పంజాగుట్ట పోలీసుల విచారణను ఎదుర్కొనున్నారు.

పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)