Breaking News

HYD: సినిమావాళ్లకు ఫారిన్‌ గంజాయి సరఫరా!

Published on Mon, 01/27/2025 - 06:48

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో విదేశీ గంజాయి(Foreign Ganja) కలకలం రేగింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్‌ చేసి మరీ అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఐటీ ఎంప్లాయిస్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి వీటిని సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గచ్చిబౌలి(Gachibowli)లో ఆదివారం రాత్రి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్‌ టింబర్‌ లేక్‌​ వ్యాలీ వద్ద గంజాయితో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.

నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 170గ్రా. ఫారిన్‌ గంజాయితో పాటు  కేజీ లోకల్‌ గంజాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలిపోర్నియా నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు సీన, రాజకీయ ప్రముఖులకు కూడా ఫారిన్‌ గంజాయి విక్రయించి ఉంటారనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)