Breaking News

మళ్లీ ఉప్పొంగిన కడెం

Published on Fri, 07/28/2023 - 03:16

కడెం: సరిగ్గా ఏడాది..మళ్లీ అదే ఉధృతి. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్‌ జిల్లాలో కడెం వాగు ఉప్పొంగుతోంది. కడెం మండల కేంద్రంలోని ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవహించింది.  వరదను కిందకు అదేస్థాయిలో పంపించే సమయంలో తొలుత నాలుగు గేట్లు మొరాయించడంతో గురువారం సాయంత్రం వరకు వాటి పైనుంచి ప్రవాహం కొనసాగింది.    

అర్ధరాత్రి నుంచి పెరుగుతూ..: బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 10,256 క్యూసెక్కులతో వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 691.600 అడుగుల వద్ద 5.598 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో భారీగా వస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు వరద గేట్లు ఎత్తి 24,750 క్యూసెక్కులు వదిలారు.

గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 14 గేట్లను ఎత్తారు. జర్మన్‌ క్రస్ట్‌ గేట్లయిన 6, 12, 2, 3 నంబర్‌ గేట్లు మొరాయించాయి. గురువారం వేకువజామున 5 గంటలకు 3,87,583 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌లో పడింది. అప్రమత్తమైన అధికారులు 14 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి, 2,18,922 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

నాలుగు గేట్లు మొరాయించిన నేపథ్యంలో అవుట్‌ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువై ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవాహం కొనసాగింది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని, కట్ట తెగుతుందనే ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో అధికారులు డేంజర్‌ జోన్‌ ప్రకటించి, సైరన్‌ మోతతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశారు. 

గేట్లతోనే సమస్య..: కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ఎత్తితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తేవి కాదన్న వాదన ఉంది. గత ఏడాది వరదకు 2, 3 గేట్ల కౌంటర్‌ వెయిట్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు రెండో గేటుకు వెయిట్‌ బిగించారు. అయినా గురువారం ఈ గేటు పనిచేయలేదు. మూడో గేట్‌ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక 6, 12 నంబర్‌ గేట్లు సైతం ఎంతకు లేవకుండా మొరాయించాయి.

మాన్యువల్‌గా హ్యాండిల్‌ తిప్పుతూ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా వరదలో కొట్టుకువచ్చిన చెట్లు, చెత్తాచెదారం తట్టుకోవడంతో సాధ్యం కాలేదు. చివరకు మధ్యాహ్నం పొక్లెయినర్‌ సహాయంతో వరద గేట్ల వెనుక భాగంలో ఇరుక్కున్న చెట్లను తొలగించడంతో 6, 12 గేట్లను మాన్యువల్‌గా ఎత్తారు.  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అధికారులు మొత్తం కడెంలోనే మకాం వేశారు.

డ్యాంగూడ, కన్నాపూర్, కొండుకూర్‌ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది ఇదే సీజన్‌లో కడెంకు ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, ప్రాజెక్టు మునిగిపోవడం గుర్తు చేసుకుంటున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)