Breaking News

గంజాయి సేవించనందుకు విద్యార్థిపై దాడి

Published on Thu, 12/21/2023 - 10:39

నిజామాబాద్: గంజాయి సేవించాలని ఒత్తిడి చేయగా.. అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థిపై మరో ఐదుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన మాక్లూర్‌ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామంలో స్కూల్‌కు కొద్దిదూరం వెళ్లి గంజాయి సేవిస్తున్నారు.

 గత శనివారం వారి తరగతిలోని మరో విద్యార్థిని సైతం గంజాయి సేవించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, సదరు విద్యార్థి అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఆ విద్యార్థి తనపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లికి చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో బాధిత విద్యార్థి తల్లి మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. సోమవారం తిరిగి బాధిత విద్యార్థి  పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులకు చెబు తావా అంటూ ఐదుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి చితకబాదారు. 

దీంతో సదరు విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి బుధవారం మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్సై సుధీర్‌రావును సంప్రదించగా విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)