Breaking News

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

Published on Mon, 11/09/2026 - 07:05

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బేగంబజార్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి.

కూకట్‌పల్లిలోని ఆస్బెస్టాస్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్‌ టీ కప్పులు, ప్లేట్స్‌ తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్‌ స్టాక్‌ గోదాములకు మంటలు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 4 ఫైర్‌ఇంజిన్లతో మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బేగంబజార్‌లోని ఓ భవనంలో బాణసంచా నిప్పులు పడి మంటలు చెలరేగాయి. అగ్నిపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. జీడిమెట్లలోని ఓ స్క్రాప్ దుకాణంలో నిప్పులు పడి మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి షాపులోని స్క్రాప్ అగ్నికి ఆహుతైంది. మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్ విలేజ్‌లోని డెకరేషన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ బండిమెట్‌లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్'లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదాల ధాటికి రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు.

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

ఇదీ చదవండి: కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)