Breaking News

Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Published on Sat, 01/24/2026 - 14:30

సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్‌లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్‌ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు.  

ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూ
నాంపల్లిలో ఫర్నిచర్‌ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.

Hyd: భారీ అగ్ని ప్రమాదం తగలబడుతున్న భవనం మంటల్లో చిక్కుకున్న పిల్లలు

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)