Breaking News

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో పేలిన ఏసీ కంప్రెసర్‌లు

Published on Fri, 05/30/2025 - 16:27

సాక్షి, హైదరాబాద్: మధురానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో ఏసీ కంప్రెసర్‌లు పేలిపోయాయి. G+5 బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు.

నగర వాసులను వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఈ నెలలోనే చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్ర‌మాదంలో 17మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతకుముందు పాతబస్తీలోలోని మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్‌ గోదాం(ప్లాస్టిక్‌ గోడౌన్‌)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మొదటి అంతస్తులో డిస్పోజబుల్‌ ప్లేట్స్‌ గోడౌన్‌, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్‌ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

 

 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)