Breaking News

నిప్పు.. ఎప్పుడు కనువిప్పు?

Published on Sun, 01/25/2026 - 07:33

సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/అబిడ్స్‌: గ్రేటర్‌ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగి్నకి ఆహుతి చేస్తోంది. నిబంధనలను మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులిచ్చేస్తోంది. ఫలితంగా అభమూ శుభమూ తెలియని అభాగ్యులు కాలిబూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరామామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్‌బ్యాక్‌లు  అధికారులకు గుర్తుకొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫరి్నచర్‌ దుకాణాలు,  గోడౌన్లు, స్క్రాప్‌ నిల్వల భవనాలు మంటల్లో మాడిమసి అవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నివాస భవనాల్లో గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో అగి్నకీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో ఐదుగురు చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది.
  
వాణిజ్య భవనాల్లో.. 
వాణిజ్య భవనాల్లో  జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత నాలుగేళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగిప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్‌ డ్రైవ్స్‌  నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూమ్‌లు, పబ్‌లు ఇలా.. అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికీ నిబంధనల కనుగుణంగా  సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లుండవు.  కాగా వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది.   

835  ప్రమాదాలు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగి్నప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తినష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్‌లో శాలిబండ  ఎల్రక్టానిక్స్‌ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. డిసెంబర్‌లో కాచిగూడ సుందర్‌నగర్‌లో జరిగిన అగి్నప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు రూ.32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.  

  • గుండెల్ని పిండేసే దుర్ఘటనలెన్నో.. 
    నిరుడు గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. 

  • గత ఏడాది టాటానగర్‌ ప్లాస్టిక్‌గోడౌన్‌లో, కూకట్‌పల్లి గ్యాస్‌ దుకాణం తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు. 

  • మూడేళ్ల క్రితం బజార్‌ఘాట్‌లో నివాస భవనంలోని కెమికల్‌ గోడౌన్‌లో సంభవించిన అగి్నప్రమాదంలో 9 మంది అసువులు బాశారు. 

  • నాలుగేళ్ల  క్రితం బోయిగూడ స్క్రాప్‌ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. 

  • గత సంవత్సరం అఫ్జల్‌గంజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)