Breaking News

ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నాడని..

Published on Sat, 03/01/2025 - 09:42

రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్‌ బహదూర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీప్రసాద్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్‌ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్‌ హుకుం జారీ చేశారని తెలిపారు. 

ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్‌ అసోసియేషన్‌ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్‌ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్‌ అసోసియేషన్‌ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)