Breaking News

పాక్‌ నటిగా పరిచయమై టోకరా

Published on Wed, 07/02/2025 - 10:11

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్‌ ఫ్రాడ్‌ చోటు చేసుకుంది. సోషల్‌మీడియాలోని మాట్రిమోనియల్‌ గ్రూప్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్‌ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మాట్రిమోనియల్‌ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. 

అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్‌ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్‌ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్‌ పేరుతోనూ చాటింగ్‌ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్‌ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. 

దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. 

తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్‌ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్‌మీడియా హ్యాండిల్స్, ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్‌ నెంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)