Breaking News

భార్య కళ్లెదుటే.. భర్త, అతడి ప్రియురాలు ఆత్మహత్య!

Published on Fri, 07/10/2026 - 11:56

హైదరాబాద్‌, అడ్డగుట్ట: ఈ నెల 7న శబరి ఎక్స్‌ప్రెస్‌లో భార్య కళ్ల ముందే భర్త, అతని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం నీలవేణి(36) మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన నీలవేణికి భర్త, 16, 18 సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు.

రెండు నెలల క్రితం కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వచ్చి మూసాపేటలో నివాసముంటున్నారు. అదే గ్రామానికి చెందిన శిరీష్‌ అనే వ్యక్తితో నీలవేణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇద్దరూ కొయంబత్తూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆచూకీ తెలుసుకున్న శిరీష్‌ భార్య సులోచన వారిని పట్టుకొని ఈ నెల 7న భర్త, నీలవేణితో కలిసి సికింద్రాబాద్‌కు శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరింది.

ఈ క్రమంలో రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో సులోచన కళ్లెదుటే శిరీష్, నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలవేణి గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శిరీష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)