Breaking News

అధికారం కోసం అడ్డదారులొద్దు

Published on Sat, 04/05/2025 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప..దాని కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకమైతే మరో మూడేళ్లలో అధికారం మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. ఏప్రిల్‌ 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. ‘బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారో చాట్‌ జీపీటీ, గూగుల్‌లో వెతికినా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. కొందరు అవగాహన రాహిత్యంతో బీజేపీ మెరుగవుతుందని అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ క్రమంగా బలహీనమవుతోంది. అబద్ధాలను ప్రచారం చేసి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతానని బీజేపీ భ్రమపడింది. వాపును చూసి బలుపు అనుకున్న బీజేపీ అసలు స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ 
ఏప్రిల్‌ 27న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలను కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ లు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, వాణిదేవి, దా సోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు ఎర్రవల్లిలో జరుగుతున్న సమావేశాలను సమన్వయం చేస్తున్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)