Breaking News

జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లను తొలగించండి

Published on Tue, 10/14/2025 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అడ్డదారుల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని 400 పోలింగ్‌ బూత్‌లలో 50 చొప్పున 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు.

జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ ‘ఓట్‌ చోరీ’పై మాట్లాడుతుంటే జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్‌ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. డూప్లికేట్‌ ఓటర్ల నమోదు, ఇతర అవకతవకలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఓటర్‌ లిస్టుపై సమగ్ర దర్యాప్తు చేయాలి 
‘ఒక్కో వ్యక్తికి మూడు నాలుగు ఓటర్‌ గుర్తింపు కార్డులున్నాయి. వేర్వేరు అడ్రస్‌లపై ఒకే వ్యక్తి ఓటు నమోదు, కొద్దిపాటి మార్పులతో ఒకే వ్యక్తి పేరు పలు చోట్ల నమోదు వంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఒక్కో ఇంట్లో వందకు పైగా ఓట్లను నమోదు చేసినట్లుగా వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంటి యజమానులకు కూడా తెలియకుండా వారి చిరునామాపై ఓట్లు నమోదు అయ్యాయి. 

కాంగ్రెస్‌ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానంగా ఉంది. ఓటర్‌ జాబితా అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల సంఘాన్ని కోరాం’అని కేటీఆర్‌ తెలిపారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో చేరి అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఓటర్‌ జాబితా అక్రమాలపై నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 

దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. కేటీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దాసోజు శ్రవణ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి, కిషోర్‌ తదితరులు ఉన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)