Breaking News

TG: మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Published on Tue, 01/27/2026 - 15:55

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నిక పోలింగ్‌.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.  

52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031  బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు.  

ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు. 

👉ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు.. ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)