Breaking News

వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి

Published on Thu, 09/07/2023 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లను నడపాలా? వద్దా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగమే నిర్ణయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో వర్షం ప్రభావం ఒక్కోలా ఉంటోంది. కొన్ని ప్రాంతా­ల్లో భారీ వర్షాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా, కొన్నిచోట్ల వర్ష ప్రభావం అంతగా ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశా­ల­లకు సెలవులు ప్రకటించడం సరికాదని ఉన్నతాధి­కారులు అభిప్రాయప­డుతు­న్నా­రు.

వాతావరణ శాఖ నివేదికను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా సెల­వులు ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను విద్యాశాఖ తిరస్కరించింది. హైదరా­బాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షం ఏమాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిలా­్లల్లో వర్షం కారణంగా స్కూళ్లు నడపలేని పరిస్థితి ఉన్న­ప్పుడు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉంటున్నా­యని గుర్తించారు. వర్షం తీవ్రంగా ఉండి, వరదలు, వాగులు పొంగడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యా­ర్థులు స్కూళ్లకు రాలేరని విద్యాశాఖ భావిస్తోంది.

అలాం­టప్పుడు జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించే అధి­కారం ఆ జిల్లా యంత్రాంగానికే ఉంటుందని, ఈ దిశగా స్పష్టమైన ఆదే­శాలు ఇస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చిన పక్షంలో ఇతర సా«­దారణ సెలవులు తగ్గించి, సిలబస్‌ పూర్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమై­నప్పుడు ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)